Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అర్జున్ క‌పూర్ కాదు ర‌ణ్‌వీర్ సింగ్‌... `క‌పిల్‌దేవ్‌` పాత్ర పోషించ‌నున్న హీరోపై స్ప‌ష్ట‌త!

  • `ప్రపంచ‌క‌ప్ 1983` నేప‌థ్యంలో సినిమా
  • ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న క‌బీర్ ఖాన్‌

ప్రపంచ‌క‌ప్ 1983 నేప‌థ్యంలో క‌బీర్ ఖాన్ తెర‌కెక్కించ‌నున్న సినిమాలో క్రికెట‌ర్‌ క‌పిల్‌దేవ్ పాత్రలో అర్జున్ క‌పూర్ నటించ‌నున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఈ పాత్రలో నటించ‌డానికి ర‌ణ్‌వీర్ సింగ్‌ను ఎంచుకున్న‌ట్లు బాలీవుడ్ ట్రేడ్ అన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్శ్ స్ప‌ష్ట‌తనిచ్చారు. 1983లో లండ‌న్‌లోని లార్డ్స్ మైదానంలో వెస్టిండీస్ జట్టుతో జ‌రిగిన ఫైన‌ల్లో గెలిచి భార‌త జ‌ట్టు మొద‌టిసారి ప్ర‌పంచ‌క‌ప్‌ను సొంతం చేసుకుంది. ఆ జ‌ట్టుకు క‌పిల్‌దేవ్ ప్రాతినిధ్యం వ‌హించారు. ఆ గెలుపు త‌ర్వాత క‌పిల్‌దేవ్ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచార‌ని, ఆయ‌న పాత్ర పోషించ‌డానికి ర‌ణ్‌వీర్ సింగ్ సరిగ్గా స‌రిపోతాడ‌ని స్క్రిప్ట్ తుది ద‌శ‌లో ఉన్నపుడే తాను నిర్ణ‌యించుకున్న‌ట్లు ద‌ర్శ‌కుడు క‌బీర్ ఖాన్ చెప్పారు.
arjun kapoor
ranveer singh
kapil dev
1983 world cup

More Telugu News